Polaroid
Teluguworld.wap.sh









విడుదల తేదీ : 07 నవంబర్ 2014
TeluguArea.com : 2.75/5
దర్శకుడు : కుమార్ నాగేంద్ర
నిర్మాత : అశోక్ – నాగార్జున్
సంగీతం : భీమ్స్ మరియు సన్నీ ఎం.ఆర్
నటీనటులు : సందీప్ కిషన్, రాషి ఖన్నా, ప్రియా బెనర్జీ, సుష్మ రాజ్…

‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’, ‘రారా కృష్ణయ్య’ సినిమాలతో బాక్స్ ఆఫీసు వద్ద వరుసగా విజయాలను అందుకున్న సందీప్ కిషన్ హీరోగా నటించిన సినిమా ‘జోరు’. ఈ సినిమా ఈ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి సినిమాతో విమర్శకులను మెప్పించిన కుమార్ నాగేంద్ర ఈ సారి ప్రేక్షకులను మెప్పించడం కోసం చేసిన ఈ కామెడీ ఎంటర్టైనర్ లో సందీప్ కిషన్ సరసన రాశి ఖన్నా, ప్రియా బెనర్జీ, సుష్మ రాజ్ లు హీరోయిన్స్ గా నటించారు. కచ్చితంగా ప్రేక్షకులను నవ్వించి బాక్స్ ఆఫీసు వద్ద విజేతగా నిలుస్తుందనుకుంటున్న జోరు సినిమా సందీప్ కిషన్ కి హ్యాట్రిక్ ఇచ్చిందా.? లేదా.? కుమార్ నాగేంద్ర కమర్షియల్ హిట్ అందుకున్నాడా.? లేదా.? అన్నది ఇప్పుడు చూద్దాం..

కథ :
‘జోరు’ అనే కథ విశాఖపట్నంలో మొదలవుతుంది. విశాఖపట్నంలో ప్రజా బందుగా పేరున్న అచ్యుతరామయ్య రాజకీయ వారసుడిగా సదాశివం(సాయాజీ షిండే) రాజకీయాల్లోకి వచ్చి మూడు సార్లు వరుసగా ఎమ్మెల్యే అవుతాడు. కానీ మంచి అనే ముసుగు చాటున అక్రమాలు చేస్తుంటాడు. ఇదిలా ఉండగా తన కుమార్తె అను(రాశి ఖన్నా) యుఎస్ నుంచి ఇండియాకి వస్తుంది. కానీ వైజాగ్ లో ఫ్లైట్ లాండింగ్ సమస్య వల్ల హైదరాబాద్ లో దిగి అక్కడి నుంచి బై రోడ్ వైజాగ్ బయలు దేరుతుంది. కానీ ఆ టాక్సీ డ్రైవర్ మోసం చేయడంతో మార్గ మధ్యంలో ఇరుక్కుంటుంది.

ఇది పక్కన పెడితే వైజాగ్ లో ఉండే మన హీరో సందీప్(సందీప్ కిషన్) చిన్న గొడవ వల్ల అమ్మ నాన్నల మీద అలిగి హైదరాబాద్ బయలుదేరుతాడు. మార్గ మధ్యంలో అనుకోకుండా కలిసిన అనుతో ప్రేమలో పడిన సందీప్ తనని వాళ్ళ నాన్న సదాశివం దగ్గరికి తీసుకెళ్ళాలని మళ్ళీ వైజాగ్ కి రిటర్న్ అవుతాడు. కట్ చేస్తే ఆ దారిలో వీరిని చంపాలని భవాని(అజయ్) అటాక్స్ చేస్తాడు. ఆ అటాక్స్ నుంచి ఎలా తప్పించుకున్నారు.? అలా తప్పించుకొని వైజాగ్ చేరుకున్న సందీప్ – అనులకు పెళ్ళికొడుకు అలియాస్ పీకే(బ్రహ్మానందం) చెప్పిన నిజం ఏమిటి.? నిజం తెలుసుకున్న వాళ్ళు ఏం చేసారు.? అసలు భవాని సందీప్ – అనులను ఎందుకు చంపాలనుకున్నాడు.? సదాశివం – భవానిలకు ఉన్న సంబంధం ఏమిటి.?

ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ గా నిలిచింది ఇద్దరే.. ఒకటి బ్యూటిఫుల్ రాషి ఖన్నా, రెండు యంగ్ హీరో సందీప్ కిషన్. రాషి ఖన్నా మొదటి సినిమాలో కంటే ఈ సినిమాలో చాలా అందంగా ఉంది. ఎంత అందం అంటే రాషి ఖన్నా తెరపై కనిపిస్తే చాలు ఆడియన్స్ కళ్ళార్పకుండా చూస్తూనే ఉంటారు. కేవలం బ్యూటిఫుల్ గా ఉండడమే కాకుండా పాటల్లో బాగా గ్లామరస్ గా కనిపించి ఆడియన్స్ ని మెప్పించింది. అలాగే అభినయంలోనూ మంచి మార్కులు కొట్టేసింది. ఇక సందీప్ కిషన్ ఈ సినిమాలో స్టైలిష్ లుక్ లో కనిపించాడు. ఎప్పటిలాంటే డైరెక్టర్ ఇచ్చిన పాత్రకి పూర్తి న్యాయం చేసాడు. అలాగే ఈ సినిమాలో రెండు పాటల్లో డాన్సులు బాగా వేసాడు. ముఖ్యంగా ‘కోడంటే కోడి కాదు’ అనే మాస్ సాంగ్ లో వేసిన మాస్ స్టెప్స్ బాగున్నాయి. సందీప్ కిషన్ ఈ సినిమాలో ట్రై చేసిన కొన్న డైలాగ్ మోడ్యులేషన్స్ బాగున్నాయి.

వీరిద్దరి తర్వాత సినిమాని నిలబెట్టింది మన కామెడీ కింగ్ బ్రహ్మానందం.. పెళ్లి కొడుకుగా బ్రహ్మానందం చేసిన కామెడీ సెకండాఫ్ లో అక్కడక్కడా నవ్విస్తుంది. బ్రహ్మానందం చెప్పే కొన్ని పంచ్ డైలాగ్స్ బాగా పేలాయి. ఇక హీరోయిన్స్ గా చేసిన ప్రియా బెనర్జీ, సుష్మలకి కథా పరంగా పెద్ద పాత్రలు లేకపోయినా ఉన్నంతలో బాగా అందాలను ఒలకబోసి మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. సాయాజీ షిండే, అజయ్ తదితరులు తమ పాత్రల పరిదిమేర నటించారు. ఈ సినిమాలోని అన్ని పాటలు విజువల్ గా చాలా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :
మైనస్ పాయింట్స్ లో ముందుగా ఎక్కడి నుంచి చెప్పాలి చెప్మా..ఓకే.. సినిమా స్టార్టింగ్ నుంచి కంటిన్యూగా చెప్పుకొస్తా.. సినిమా మొదలైంది, పాత్రల పరిచయాలయ్యాయి..ఆ తర్వాత కథలోకి వెళ్ళాలి కానీ పాత్రల పరిచయాల దగ్గరే సినిమా కథ ఆగిపోతుంది.. డైరెక్టర్ కూడా కథని అక్కడే ఆపేసి సప్తగిరితో కామెడీ చేయించాలని చూసాడు. కానీ ఆ కామెడీ ట్రాక్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది.దాంతో ఇంటర్వెల్ వరకూ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది అన్నట్టుగా అక్కడే ఆగిపోయింది. కట్ చేస్తే ఇంటర్వల్ లో చిన్న ట్విస్ట్(అది మీరు ఊహించిందే). ఇక సెకండాఫ్ అందరినీ తీసుకొచ్చి ఒకే ఇంట్లో పెట్టి పలు పాత్రలతో ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేసి తెగ నవ్వించేయాలని డైరెక్టర్ తెగ ప్లాన్స్ వేసుకున్నాడు. కానీ స్క్రీన్ పైకి వచ్చే సరికి అవేవీ వర్కౌట్ అవ్వలేదు. సో మళ్ళీ బోరింగ్ కంటిన్యూ అవుతుంది.

సప్తగిరి అంటే ఫుల్ ఫన్ అని ఆడియన్స్ ఈ మధ్య ఫిక్స్ అయ్యారు, కానీ ఈ మూవీలో సప్తగిరిట్రాక్ బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. ఉదాహరణకి ఎలుగుబంటితో చేసే కామెడీ ట్రాక్ సినిమాలో కంటే రిలీజ్ కి ముందు రిలీజ్ చేసిన టీజర్ లోనే ఎక్కువ నవ్వు తెప్పిస్తుంది. ఇక కథ కూడా పాత చింతకాయపచ్చాడే.. పాత కథలకి దీనికి డిఫరెన్స్ ఏమిటి అంటే ఇలాంటి స్టొరీ గతంలో సందీప్ కిషన్ చెయ్యలేదు, ఇప్పుడు చేసాడు. సినిమా నిడివి 2 గంటల 20 నిమిషాలే అయినా డైరెక్టర్ రాసుకున్న బోరింగ్ స్క్రీన్ ప్లే వలన ఓ నాలుగైదు గంటల సినిమా చూసామన్న ఫీలింగ్ వస్తుంది. ఇది నేను ఒక్కడినే కాదు నాతో పాటు చూసిన పలువురు కామన్ ఆడియన్స్ రెస్పాన్స్ కూడా అందుకే ఇక్కడ చెప్తున్నా.. ఇక స్లాప్ స్టిక్ కామెడీ అని ప్రచారం చేసారు కానీ ఇందులో స్లాప్ స్టిక్ కామెడీ లేకపోగా, కొన్ని చోట్ల కుళ్ళు కామెడీ ఎక్కువైంది.

ఈ సినిమా మొదట్లో సందీప్ – రాషి ఖన్నాల మధ్య లవ్ ట్రాక్ ఉన్నట్టు చూపిస్తారు కానీ ఆ ట్రాక్ మళ్ళీ సినిమాలో ఎక్కడా కంటిన్యూ అవ్వదు. ఇకపోతే మొదటి నుంచి సినిమాలో హై రేంజ్ విలన్ లాగా బిల్డప్ ఇచ్చిన అజయ్ పాత్రకి ముగింపు సరిగా ఉండదు మరియు అజయ్ ఏమయ్యాడో కూడా చూపించరు. అలాగే లాజికల్ గా కూడా సినిమాలో చాలా మిస్టేక్స్ ఉంటాయి.

సాంకేతిక విభాగం :
ఈ సినిమాకి టెక్నికల్ డిపార్ట్ మెంట్ లో చెప్పుకోవడానికి కొన్ని బెస్ట్ డిపార్ట్ మెంట్స్ ఉన్నాయి. అవే సినిమాటోగ్రఫీ, మ్యూజిక్. ఎంఆర్ పళని కుమార్ అందించిన సినిమాటోగ్రఫీ సింప్లీ సూపర్బ్. తన గ్రాండ్ విజువల్స్ ఈ సినిమాకి చాలా ప్రాణం పోసాయి. ప్రతి లొకేషన్ ని చాలా గ్రాండ్ గా చూపించాడు. ముఖ్యంగా సాంగ్స్ లో విజువల్స్ అదిరిపోయాయి. ఇకపోతే భీమ్స్ అందించిన మ్యూజిక్ చాలా బాగుంది. అలాగే సన్నీ.ఎం.ఆర్ – భీమ్స్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఇక చెప్పుకోవాల్సింది ఆర్ట్ డిపార్ట్ మెంట్ ని డీల్ చేసిన మురళి కొండేటి వేసిన సెట్టింగ్స్ బాగున్నాయి. ఎస్ఆర్ శేఖర్ ఎడిటింగ్ లో చాలా కేర్ తీసుకోవాల్సింది. ఎందుకంటే చాలా చోట్ల అనవసరమైన సీన్స్ లెంగ్త్ ఎక్కువైపోతున్నా కట్ చెయ్యకుండా లా వదిలేసారు. అవి కట్ చేసి ఉంటే ఇంకాస్త బెటర్ గా ఉండేది.

ఇక మొదటి సినిమా కోసం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ తో సినిమా తీసి విమర్శకులను మెప్పించిన డైరెక్టర్ కుమార్ నాగేంద్ర సక్సెస్ కోసం అందరిలానే పాత రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ ని నమ్ముకున్నాడు. అందుకే పాత కథని, పాత స్క్రీన్ ప్లే ఫార్మాట్ ని నమ్ముకున్నాడు. కథ – ఆడియన్స్ సర్ప్రైజ్ ఫీలయ్యేది ఏమీ లేదు, స్క్రీన్ ప్లే – కథలో సర్ప్రైజ్ ఏమీ లేదుకదా, స్క్రీన్ ప్లే లో మాత్రం ఎందుకని చాలా లైట్ తీసుకున్నారు. ఇక దర్శకత్వం విషయానికి వస్తే జస్ట్ పాస్ మార్క్స్ తెచ్చుకున్నాడు. కనీసం మొదటి సినిమాకి స్కోర్ చేసిన మార్కులు కూడా తెచ్చుకోలేకపోయాడు. మొదటి సినిమా పరంగా తనకి ఏమి వచ్చో అదే తీయాలనుకున్నాడు అందుకే అందులో చాలా క్లారిటీ ఉంటుంది, కానీ జోరు అనేది టచ్ లేని, పూర్తిగా తెలియని ఫార్మాట్ లో చేసిన సినిమా. అందుకే లెక్కలేనన్ని తప్పులు చేసి ఆడియన్స్ ని పూర్తిగా ఎంటర్టైన్ చేయలేకపోయాడు. ఒక్క విషయం చెప్పాలి.. సినిమాలో హీరో, హీరోయిన్స్, బ్రహ్మానందం, మిగతా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉంటే హిట్ అవ్వదు, సినిమా విజయానికి కథ – కథనం చాలా ముఖ్యం అనే చిన్న లాజిక్ ని డైరెక్టర్ ఎలా మిస్ అయ్యాడో. ఇక అశోక్ – నాగార్జున్ ల నిర్మాణ విలువలు మాత్రం బాగా రిచ్ గా ఉన్నాయి.

తీర్పు :

వరుసగా రెండు కమర్షియల్ హిట్స్ అందుకున్న సందీప్ కిషన్ హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని చేసిన ‘జోరు’ సినిమా ఆడియన్స్ ని అంతగా మెప్పించలేకపోయింది. గత సినిమాలు బాగున్నాయనే నమ్మకంతో ఈ సినిమాకి వెళ్ళే ప్రేక్షకులు చాలా వరకూ నిరుత్సాహానికి గురవుతారు. కథ – కథనం లేకుండా స్టార్ ని పెట్టుకొని సినిమా తీస్తే మొదటి రోజు ప్రేక్షకులు వస్తారేమో కానీ మరుసటి రోజు రారు. సినిమా విజయం సాధించాలి అంటే మొదటి మూడు రోజుల తర్వాత వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరగాలే కానీ తగ్గకూడదు. కానీ ఈ సినిమాకి ఆడియన్స్ తగ్గిపోతారు. అంటే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చెయ్యడంలో ఫెయిల్ అయ్యిందనే అర్థం. రాషి ఖన్నా, సందీప్ కిషన్ లతో పాటు బ్రహ్మానందం చేసిన కొన్ని కామెడీ సీన్స్ మరియు పాటలు ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ అయితే ఓల్డ్ కథ – బోరింగ్ కథనం – సాగదీసిన సీన్స్ బిగ్గెస్ట్ మైనస్ పాయింట్స్. ఓపెనింగ్స్ బాగా రావడం వలన ఈ వీకెండ్ సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.


TeluguWorld.wap.sh:-2.75/5




Users Online


878